ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

గత నెల 29 నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ హైదరాబాదులోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత నెల 29వ తేదీ నుంచి ఆయన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అక్కడే అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన పలు సమావేశాలు నిర్వహించారు. ఈరోజు ప్రగతి భవన్ కు వచ్చిన వెంటనే పలువురు కీలక నేతలు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఇక రాజ్యసభకు పోటీ పడే టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ రేపు ఖరారు చేయనున్నారు. ఎల్లుండి రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడపనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/