నిమ్స్‌ని సందర్శించిన తెలంగాణ గవర్నర్

నిమ్స్‌ని సందర్శించిన తెలంగాణ గవర్నర్
Governor Tamilisai Soundararajan visits NIMS hospital

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్‌ ఆసుప్రతిని సందర్శించారు. అక్కడి మివీనియం బ్లాక్‌లోని కరోనా సోకిన డాక్టర్ల కుటుంబాల సభ్యులను కలిసి నైతిక మద్దతు తెలిపారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకు చెక్ పెట్టే విషయంలో డాక్టర్లు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారనీ, ప్రాణాలను పణంగా పెడుతున్నారనీ గవర్నర్ మెచ్చుకున్నారు. కాగా కరోనాపై యుద్దంలో ముందుండి పోరుడుతున్న వైద్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించినట్లు ఈసందర్భంగా గవర్నర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలేవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రజలతో ఉందని గవర్నర్‌ తెలిపారు.
నిమ్స్‌ ఆస్పత్రి‌లోని ప్రొఫెసర్లు, రెసిడెంట్‌ డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్మికులు కరోనా‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే పది మందికిపైగా డాక్టర్లు చికిత్స పొందుతున్నారు. మరో 20 మందిని హోం క్వారంటైన్‌కి పంపాలని నిర్ణయించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/