ఏపిలో ఓటర్లుగా గవర్నర్‌ దంపతులు నమోదు

AP governor Biswabhusan Harichandan
AP governor Biswabhusan Harichandan

అమరావతి: ఏపిలో గవర్నర్‌ దంపతులను ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఏపి గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఆయన భార్య సుప్రవ హరిచందన్‌లు ఆంధ్రప్రదేశ్‌ లో ఓటర్లుగా నమోదైయ్యారు. విజయవాడ మధ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏపి రాజ్‌ భవన్‌కు నియోజకవర్గ ఉప ఎన్నికల విభాగపు ఉప తహసీల్దార్‌ నాగమణి వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు వచ్చారు. కాగా గవర్నర్‌ దంపతులకు సంబంధించిన వివరాలను అప్పటికప్పుడే సరిచూసుకున్న అధికారులు జిల్లా అధికారి ద్వారా రాష్ట్ర ప్రథమ పౌరడు అయినటువంటి గవర్నర్‌కు అతి త్వరలోనే ఓటరు కార్డును అందజేస్తామని తెలిపారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/