శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి

Sri Vasavi Maathaa
Sri Vasavi Maathaa

కైలాసవాసులైన వైశ్యులు గోకర్ణము నుండి భూతలమునకు వచ్చినపుడు వారికి నాయకత్వము వహించినవాడు ఉద్వాహుడు అను వైశ్యుడు. ఆతని కుమారుడు మాఘడు. అతని పుత్రుడు మధుమంతుడు. ఆయనే మహావిష్ణువ్ఞను ఉపాసించి కాలగమనము గల విమానమును పొంది యక్షలోకానికి పోయి విశ్వావసుడను యక్ష రాజేంద్రుని కుమార్తె కోకిల యను సుందరిని వివాహమాడి జగత్ప్రసిద్ధుడైనవాడు. ఆ మధుమంతునికి అయిదు మంది పుత్రులు. వారు మణిమంతుడు, కీర్తిమంతుడు, శ్వేతుడు, ముచికుందుడు, విరోచనుడు. వారైదుగురు చాలా పరాక్రమవంతులు. విరోచనునికి ఇద్దరు కుమారులు. తులాధారుడు, మణీధారుడు. ధర్మాత్ముడై వంశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన తులాధారుని కుమారుడు బ్రహ్మ జ్ఞానియైన మణిశ్రవ్ఞడు. ఆయనకు జటిలుడు, ఆ జటిలునకు భద్రుడు, ఆ భద్రునకు హయగ్రీవ్ఞడు జన్మించి ఆ వంశమును కొనసాగించారు. హయగ్రీవ్ఞని కుమారుడు పద్మాక్షుడు. ఆ పద్మాక్షుని కుమారులు హేమవర్ణుడు, శ్రవణ కుమారుడు. ఈ శ్రవణ కుమారుడే గుడ్డివారు, ముసలివారైన తన తల్లి తండ్రులను ఒక కావడిలో ఉంచి వారిని మోస్తూ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నిటినీ దర్శింపచేసి చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించాడు. అంతటి మహనీయుని వంశంలో జన్మించినవాడు శివ్ఞడు. శివ్ఞని కుమారుడు గోముఖుడు. ఆ గోముఖుని కుమారుడు కుముదుడు. కుముదుని కుమారుడు కల్హరుడు. కల్హరునికి చాలా కాలం సంతానం కలుగలేదు. అందుచేత ఆయన ఈశ్వరుని కుసుమములతో పూజించాడు. అతని భక్తికి మెచ్చి శివ్ఞడు కలలో కనిపించి ఒక కుమారుడు కలిగేట్లు వరమిచ్చాడు. కొంతకాలానికి కల్హరునికి పుత్రుడు జన్మించాడు. విచిత్రముగా ఆ మయంలో కుసుమ వర్షం కురిసింది. అందుచేత కల్హరుడు అతనికి కుసుమశ్రేష్టి అని పేరు పెట్టాడు. ఆయనే పెరిగి, పెద్దవాడై పదునెనిమొది పట్టణముల నాయకులైన నగర స్వాములతో ఒక మహాసమితిని ఏర్పాటు చేసి, వారి అభిప్రాయములను మన్నిస్తూ గణతంత్ర విధానములో వైశ్య సామ్రాజ్యమును ప్రజానురంజకంగా పరిపాలించేవాడు. రైతులకు తోడ్పడి బంగారు పంటలను పండింపచేశాడు. వేల గోమఠాలను నిర్మించి పశు సంపదను అభివృద్ధి చేశాడు. ఘనమైన ఓడలను నిర్మింపచేసి సముద్ర వ్యాపారాన్ని వికసింపచేశాడు. కవి, శిల్పి, పండిత, గాయకులను పెంచి పోషించి లలితకళా పోషకుడున్న కీర్తిని పొందాడు. వాసవీ కన్యకాపరమేశ్వరిగా జన్మనెత్తిన ఆదిపరాశక్తికే తండ్రి కాగల్గిన అదృష్టవంతుడు ఆ కుసుమశ్రేష్టి. దీన్ని బటేట అర్ధమవ్ఞతున్నది ఆ వంశం ఎంత ఉన్నతమైందో, ఎంత ప్రాచీనమైందో. మనమూ మన వంశాలను సకల సద్గుణ సంపన్నుల వంశాలుగా చేయటానికి కృషి చేయాలి. అప్పుడే జన్మసార్ధకమవ్ఞతుంది.
– రాచమడుగు శ్రీనివాసులు