స్వీయ నిర్బంధంలోకి రాజస్థాన్‌ సిఎం

75% Employment for Local
Rajasthan CM Ashok Gehlot

జైపూర్‌: రాజస్థాన్‌ సిఎం అశోక్ గెహ్లాట్ ఇవాళ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సహా తన నివాసంలో పనిచేస్తున్న పది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ సిఎం అశోక్‌ గెహ్లాట్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో పది మందికి కొవిడ్19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలు, సమావేశాలను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు..’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) పనిచేసే 9 మందికి, ముఖ్యమంత్రి అధికారిక నివాసం (సీఎంఆర్)లో పనిచేసే ఒకరికి కరోనా సోకినట్టు తెలిపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/