కుప్పకూలిన ఎలాన్‌ మస్క్‌ స్సేస్‌ ఎక్స్‌ మిషన్‌ రాకెట్‌

వాషింగ్టన్‌: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ మిషనకు రెండు నెలల్లోనే రెండో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం స్పేస్‌ఎక్స్ రాకెట్ మరొక నమూనా ల్యాండింగ్ సమయంలో క్రాషై కుప్పకూలిపోయింది. భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో మంటలతో నిండిపోయి కుప్పకూలిపోయింది. అంతకుముందు డిసెంబర్‌ నెలలో కూడా కంపెనీ స్టార్‌షిప్ రాకెట్ కూడా ఇలాంటి ప్రమాదానికే గురైంది. టెక్సాస్‌లోని బోకా చికా ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. సరిగ్గా ప్రయోగించిన ఆరు నిమిషాలకే కుప్పుకూలింది.

ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన ఈ స్పేస్‌ ఎక్స్‌ సంస్థ.. భవిష్యత్‌ రోజుల్లో అంతరిక్షంలోకి మానవులను, 100 టన్నుల సరుకులను తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేస్తున్న హెవీలిఫ్ట్ రాకెట్‌కు ఇది నమూనా. సెల్ఫ్‌ గైడెడ్, 16 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రారంభంలో నాసాస్పేస్‌ఎక్స్ లైవ్‌స్ట్రీమ్ కవరేజ్‌లో ఎలాంటి సమస్య లేకుండా లాంచ్ ప్యాడ్ నుంచి దక్షిణ టెక్సాస్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. విమాన శిఖరానికి చేరుకున్న ఈ వ్యోమనౌక 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. కొద్దిసేపు అది గాలిలోనే ఉండిపోయింది. ఈ సమయంలో దాని ఇంజిన్లను ఆపివేసి, ఏరోడైనమిక్ నియంత్రణలో భూమిపైకి తిరిగి దిగడానికి ప్రణాళికాబద్ధమైన ఖిబెల్లీఫ్లాప్ఖి యుక్తిని అమలు చేశారు. తిరిగి వచ్చేటప్పుడు నేరుగా దిగడానికి ప్రయత్నించగా ఇబ్బందులు మొదలయ్యాయి. కుప్పకూలే సమయంలో రాకెట్‌లో వేగం పెరిగినట్లు ఫుటేజీ ద్వారా అర్ధమవుతున్నది. ఈ రాకెట్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/