గజ్వేల్‌లో కల్పకవనాన్ని ప్రారంభించిన మంత్రులు

సిద్దిపేట: జిల్లాలోని గజ్వెల్ మున్సిపాలిటీ సంగపూర్ వద్ద కల్పకవనాన్ని మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు. జిల్లాలోని గజ్వెల్ మున్సిపాలిటీ సంగపూర్ వద్ద కల్పకవనాన్ని మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..292.5 ఎకరాల భూమిలో 7న్నర కోట్ల రూపాయలతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. తక్కువ సమయంలో రాష్ట్రంలో 4 శాతం అడవులను పునరుద్ధరణ చేసినట్లు చెప్పారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…రూ.7.50 కోట్లతో చక్కటి అర్బన్ పార్క్‌ను నిర్మించుకుని, ప్రారంభించుకున్నామన్నారు. పట్టణాలు కాంక్రీట్ జంగల్స్‌గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా 36వ అర్బన్ పార్క్‌ను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వన భోజనాలను, పిల్లలతో విహార యాత్రలకు రండి ఇది మీ కోసమే అని మంత్రి తెలిపారు. మొక్కలు నాటడం మన భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడమే అని చెప్పుకొచ్చారు. ఎంత ఆస్తిని ఇచ్చామనేది కాదు చక్కటి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం కావాలన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/