అమానవీయ ఘటన : మహిళా ఖైదీని అందరి ముందు నగ్నంగా డాన్స్ చూపించిన మహిళా అధికారి

పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్​షిప్​లో ఓ చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను విచారణ నిమిత్తం శభానా అనే మహిళా అధికారి అరెస్టు చేసింది. పోలీస్ రిమాండ్​లో ఉన్న ఆ మహిళను బట్టలు విప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత జైలులో అందరిముందు నగ్నంగా నృత్యం చేయించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన దర్యాప్తు కమిటీ.. ఆమెను విధుల నుంచి తొలగించారు.

ఈ ఘటన ఫై క్వెట్టా డీఐజీ అజార్ అక్రమ్​ మాట్లాడుతూ..జైళ్లలో కూడా మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే మహిళా పోలీస్ అధికారులతోనే విచారణ జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.