తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్‌లో చేరాలని ఆహ్వానించారు: సంజయ్‌ రౌత్‌

Sanjay Raut
Sanjay Raut

ముంబయి : తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్‌లో చేరాలని తనకూ ఆహ్వానం అందిందని, అయితే దానిని తాను తిరస్కరించానని శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఎందుకంటే తాను శివసైనికుడినని, బాలాసాహెబ్‌ థాక్రే మార్గంలో నడుస్తున్నానని చెప్పారు. ఎక్‌నాథ్‌ చౌదరి శివసేన ముఖ్యమంత్రి కాదని, ఇప్పటికే ఈ విషయాన్ని ఉద్ధవ్‌ థాక్రే స్పష్టం చేశారని తెలిపారు. ముంబైలో శివసేన అధికారాన్ని తగ్గించడానికి బీజేపీ కుట్ర పన్నిందని, అందులో భాగంగా ఏక్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని వెల్లడించారు.

పూర్తి విశ్వాసంతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యానని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఎందుకంటే తాను ఎలాంటి తప్పూ చేయలేదని, పది గంటల విచారణ అనంతరం తిరిగి బయటకు వచ్చానని చెప్పారు. ఇలాగే గువాహటి కూడా వెళ్లాల్సి ఉండే కానీ తాను బాలాసాహెబ్‌ సైనికుడినని, అందుకే అక్కడికి పోలేదని తెలిపారు. మన వైపు నిజం ఉన్నప్పుడు బయపడాల్సిన అవసరం ఏముందన్నారు. శివసేన ఉద్ధవ్‌ థాక్రేతోనే ఉందని స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/