సీబీఐ నుండి 103 కేజీల బంగారం మాయం..విచారణకు హైకోర్టు ఆదేశం

సీబీఐని విచారించాల‌న్న మద్రాస్‌ హైకోర్టు

Gold ETF
Gold ETF

చెన్నై: తమిళనాడులోని సీబీఐ కస్టడీ నుండి 103 కేజీల బంగారం అదృశ్యమైంది. ఈ ఘనపై విచారణ జరపాలంటూ మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. దీంతో సీబీఐ ప్ర‌తిష్టకు మ‌చ్చ ప‌డిన‌ట్లు అయ్యింది. స్థానిక పోలీసులు త‌మ‌ల్ని విచారిస్తే, త‌మ ప్ర‌తిష్ట దెబ్బ‌తింటుంద‌ని సీబీఐ వాదించినా.. మ‌ద్రాసు హైకోర్టు ప‌ట్టించుకోలేదు. సీబీఐకి ఇది అగ్నిప‌రీక్షే కావొచ్చు కానీ, సీత‌లాగ స్వ‌చ్ఛ‌మైతే, మీరు మ‌రింత స్వ‌చ్ఛంగా బ‌య‌ట‌ప‌డుతార‌ని, ఒక‌వేళ అలా కాక‌పోతే ప‌రిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని న్యాయ‌మూర్తి పీఎన్ ప్ర‌కాశ్ తెలిపారు. సుర‌నా కార్పొరేష‌న్ లిమిటెడ్ నుంచి సీజ్ చేసిన 400 కేజీల బంగారం నుంచి 103 కిలోల బంగారం అదృశ్య‌మైంది. 43 కోట్ల విలువైన ఆ బంగారం ఆచూకీ చెప్ప‌డంలో సీబీఐ విఫ‌ల‌మైంది. దీంతో స్థానిక పోలీసులు ఆ కేసును విచారించాల‌ని మ‌ద్రాసు హైకోర్టు శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/