దిగివస్తున్న పసిడి ధరలు

మార్కెట్‌ వాచ్‌

GOLD
GOLD

ముంబై: బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దారిలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది.

హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కి చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.90తగ్గి రూ.47,130కి చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజి వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,500కి చేరింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ఔన్స్‌కు 0.17శాతం పెరుగుదలతో 1908డాలర్లకు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.47శాతం పెరుగుదలతో 24.53డాలర్లకు చేరింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.

ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీరేట్లు, జ్యుయెల్లరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చరూపుతాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/