విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్లు రద్దు

విశాఖ సమీపంలో అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేసారు. ఆ వివరాలు చూస్తే..

నేడు రద్దైన రైళ్లు ఇవి..

  • హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
  • విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
  • సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
  • విశాఖపట్టణం-తిరుపతి (22708)
    *గుంటూరు-రాయగడ (17243)
  • విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
  • విశాఖపట్టణం-కడప (17488)

నేడు, రేపు రద్దైన రైళ్లు ఇవే

  • కడప-విశాఖపట్టణం (17487)
  • విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
  • మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
    *విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
  • రాయగడ-గుంటూరు (17244)