రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకారం

నూతన ఎస్ఈసి కి అధికారుల అభినందన

Neelam Sahni takes over as SEC of AP
Neelam Sahni takes over as SEC of AP

Amaravati:  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీ కి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.

ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించగా.. నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/