ఢిల్లీకి పయనమైన సిఎం రేవంత్ రెడ్డి

11 మంది మ మంత్రుల శాఖలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్న రేవంత్ రెడ్డి

cm-revanth-reddy

హైదరాబాద్‌ః మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు ఢిల్లీకి చేరుకొని, మంత్రివర్గ కూర్పుపై చర్చించి, తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా 6గురికి ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై కూడా చర్చించనున్నారు. ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు.

మరోవైపు శనివారం ఉదయం 8.30 గంటలకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజ భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి… స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు.