భక్తులకు గుడ్ న్యూస్ : శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప స్వామి భక్తులకు రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. శబరి మలకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 22 రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లం, నర్సాపుర్-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్-కొట్టాయం, కొల్లం-సికింద్రాబాద్ మధ్య నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.