ఒమేగా స్టార్ జగన్ : మన హీరోలు జీరోలు:ఆర్జీవీ ట్వీట్స్

రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్స్

RGV Tweets-Omega Star jagan
RGV Tweets-Omega Star jagan

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ , నటుడు ఆర్ .నారాయణమూర్తి , ఆలీ , పోసాని తదితరులు కలిసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ సమస్యలపై జరిగిన ఈ భేటీ తీరుపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించారు. జగన్ ‘రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్ ‘ అంటూ పేర్కొన్నారు. మహేష్ , ఛిఛిరంజీవి, ప్రభాస్ ఒమేగా స్టార్ జగన్ ఛుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవటమే దీనికి ఉదాహరణ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. రీల్ ఫిల్మ్ లో ఫ్రేమ్ మధ్యలో మహేష్, చిరంజీవి, ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారని, కానీ , రియల్ ఫిల్మ్ లో ఫ్రేమ్ మధ్యలో జగన్ ఉన్నారని అన్నారు. జగన్ కు వారు అంతా భయపడ్డారని , బిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా బెగ్గింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో ఏపీ సీఎం , ఒమేగా స్టార్ జగన్ ను చూసి ఆశ్చ్యర్య పోయానని, సూపర్ మెగా స్టార్స్ అందరినీ ‘ హీరోలు అందరూ జీరోలు ‘ చేసి ఆయన నిరూపించారని పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి .

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/