ఆరోగ్యానికి మేలు చేసే జొన్న

Jonnalu

చాలా సంస్కృతుల్లో జొన్నన్నం, జొన్నరెట్టులూ నిత్య ఆహారంగా ఉన్నాయి. రెండు మూడు తరాల కింద వరి ఆహారానికి మారకముందు జొన్న అన్నం, జొన్నరొట్టెలు తినడమే పరిపాటి. జొన్నల్లో ప్రొటీన్లు ఎక్కువే. అందుకే జొన్న రొట్టెల్ని బలవర్థక ఆహారంగా పరిగణిస్తుంటారు.

వీటిల్లో ఐరన్‌, కాల్షియం, పొటిషియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు ఎక్కువ. థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ వంటి బికాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్లు ఎక్కువ.

జొన్నల్లో ఉండే ఫీనాలిక్‌ యాసిడ్స్‌, ట్యానిన్స్‌, యాంథోసయనిన్‌ వంటి పోషకాలు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైన అంశం జొన్నలు తినేవారికి స్థూలకాయం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. అందువల్ల ఊబకాయం ద్వారా వచ్చే ఎన్నో అనర్ధాలను నివారించనట్లు అవుతుంది. గుండె ఆరోగ్యానికి జొన్ని ఎంతో మేలు చేస్తుంది.

ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు వచ్చే ఎన్నో రకాల సమస్యలను నివారిస్తాయి. మలబద్ధకం సమస్యను స్వాభావికంగా అధిగమనించవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలాకాలం పాటు యవ్వనంగా కనిపించడం సాధ్యమవుతుంది. గ్లూటెన్‌ కారణంగా గోధుమ వల్ల అలర్జీ ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యరకరమైన ప్రత్యామ్నాయం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/