రైతన్నగా ధోనీ కొత్త అవతారం

సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం

MS Dhoni
MS Dhoni

రాంచీ: టీమిండియాకు అతి ఉత్తమమైన కెప్టెన్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. అయితే ఇన్నాళ్లు మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలోకి దిగాడు. బ్యాట్ పట్టిన చేత్తోనే విత్తనాలు నాటుతున్నాడు. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రైతుగా మారాడు. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని పండిస్తున్నాడు. ఈ వీడియోను స్వయంగా ధోనీయే షేర్ చేశాడు. బొప్పాయి తర్వాత తొలిసారి పుచ్చకాయ పంటను సేంద్రీయ పద్దతితో పండిస్తున్నానని పేర్కొన్నాడు ధోనీ. కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తే.. మీరు గ్రేట్ మహీ అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. బురద రాజకీయాల వైపు రాకుండా మీకు నచ్చినట్లుగా జీవించాలని సలహాలు ఇస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మంచి ఆలోచన.. ఇందులో కూడా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/