రియల్‌మి ప్రచారకర్తగా బాలీవుడ్‌ కండలవీరుడు

సల్మాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న మాస్‌ ఇమేజ్‌ తమ బ్రాండ్‌కు ఉపయోగపడుతుంది

salman khan
salman khan

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయరీ సంస్థ రియల్‌మి ప్రచారకర్తగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను నియమించింది. ఈ విషయాన్ని బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రోకు ప్రచారకర్తగా ఉంటారు. సల్మాన్‌ఖాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న మాస్‌ ఇమేజ్‌ తమ బ్రాండ్‌కు ఉపయోగపడుతుందని రియల్‌మి వైస్‌ ప్రెసిడెంట్‌, భారతీయ విభాగం సీఈవో మాధవ్‌ సేత్‌ తెలిపారు. సల్మాన్‌ రాకతో మా కంపెనీ థీమ్‌ అయిన్‌ డేర్‌ టూ లీప్‌ బలం చేకురుతుందన్నారు. రియల్‌మి 6లో స్టైల్‌, ఎడ్జ్‌ వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుందని మాధవ్‌ సేత్‌ తెలిపారు. మార్చి 5న తేదీన రియల్‌మి6 విడుదల చేయనున్నారు. ప్రస్తుతం 2019 లెక్కల ప్రకారం అత్యంత వేగంగా ఎదుగుతున్నా స్మార్ట్‌ఫోన్ల తయరీ బ్రాండ్లలో రియల్‌మి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/