రక్తహీనత సమస్య నివారణకు

ఆహారం-జాగ్రత్తలు

Low Iron-Aanemia
Low Iron-Aanemia

ఐరన్‌ ఉన్న ఆహార పదార్థాలను రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఐరన్‌ కూడా ఒకటి. ఐరన్‌ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ బాగా సరఫరా అవుతుంది. ఐరన్‌ ఎక్కువగా అందాలంటే పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు,పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్‌ ఉంటుంది.

రక్తహీనత సమస్య నివారణకు
Iron Food-To prevent the problem of Anemia

మన శరీరానికి నిత్యం కావాల్సిన ఐరన్‌లో 25 శాతం ఐరన్‌ను టమోటాలు తినడం వల్ల పొందవచ్చు.

అలాగే బ్రకోలి, పిస్తా, బాదంపప్పు, మటన్‌ లివర్‌, పల్లీల్లోనూ ఐరన్‌ ఉంటుంది. యాప్రికాట్స్‌, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర తదితర పదార్థాల్లోనూ ఐరన్‌ ఉంటుంది.

ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఐరన్‌ బాగా అందుతుంది. దీంతో ఐరన్‌ లోపం, రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/