పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న పూజా హగ్దే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హగ్దే పెద్దమ్మ గుడి లో సందడి చేసింది. అమ్మవారిని దర్శించుకుని అక్కడి వేద పండితుల ఆశీర్వాదం పొందింది. గత ఏడాది అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదు. అంతకుముందు వరకు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ భామకు ..2022 బాగా దెబ్బతీసింది. ఒకటి , రెండు కాదు ఏకంగా మూడు హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకుంది. రాదే శ్యామ్ , ఆచార్య , బీస్ట్ తో పాటు హిందీ లో నటించిన మూవీ సైతం భారీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ లో మాత్రమే నటిస్తుంది. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడి లో సందడి చేసింది. అమ్మవారిని దర్శించుకుని అక్కడి వేద పండితుల ఆశీర్వాదం పొందింది. పూజా హెగ్డే పెద్దమ్మ గుడికి వచ్చిందని తెలిసి స్థానికంగా పెద్ద ఎత్తున జనాలు అక్కడ పోగయ్యారు. కొంత సమయం మాత్రమే ఉన్న పూజా హెగ్డే వెంటనే అక్కడ నుండి వెళ్లి పోయినట్టు తెలుస్తుంది.