కేబినెట్‌లో కరోనాపై ఎందుకు చర్చించలేదు?

సామాన్య, మధ్యతరగతి వారికి కూడా మంచి వైద్యం అందించాలి

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

అమరావతి: ఏపిలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసుల విషయంలో టిడిపి నేత ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఊహించని విధంగా పెరుగుతున్నప్పటికీ ప్రజలకు భరోసా కల్పించడం లేదని ఆయన అన్నారు. ‘నిన్న 9782 కేసులు, 86 మరణాలు. కొంతమంది ప్రజా ప్రతినిధులు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. సామాన్య, మధ్యతరగతి వారికికూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలి. 3,16,000 కేసులు, 3,000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఎందుకు నిన్న కేబినెట్‌లో చర్చించి ప్రజలకు భరోసా కల్పించలేదు వైఎస్‌ జగన్‌?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/