గోవా ప్ర‌జ‌లు కాంగ్రెస్ పాల‌న‌ను కోరుకుంటున్నారు : డీకే శివ‌కుమార్‌

dk-shiva-kumar

బెంగళూరు : గోవా ప్ర‌జ‌లు కాంగ్రెస్ పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని క‌ర్నాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌తో డీకే శివ‌కుమార్ బుధ‌వారం భేటీ అయ్యారు. ప్ర‌స్తుత అంశాలు, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌పై డీకే వారితో చ‌ర్చించారు. త‌మ అభ్య‌ర్థులంద‌రూ రిసార్ట్‌లోనే ఉంటార‌ని హామీ ఇచ్చార‌ని, ఒక్క‌రు కూడా కాంగ్రెస్ నుంచి పోర‌ని స్ప‌ష్టం చేశారు. అభ్య‌ర్థులంద‌రూ క‌లిసి క‌ట్టుగానే వుంటార‌ని డీకే శివ‌కుమార్ స్ప‌ష్టం చేశారు.

గోవాలో హంగ్ వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేయ‌డంతో కాంగ్రెస్ అప్ర‌మ‌త్త‌మైంది. 2017 లాంటి ప‌రిస్థితుల్లో చిక్క‌కూడ‌ద‌ని, ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థులంద‌ర్నీ రిసార్టుల‌కు పంపించారు. ఇదే విషంపై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ క‌త్‌నీక‌ర్ స్పందించారు. తాము బ‌ల‌వంతంగా ఎవ్వ‌ర్నీ రిసార్టుల‌కు పంప‌లేద‌ని, అభ్య‌ర్థులంద‌రూ స్వ‌చ్ఛందంగానే రిసార్టుల‌కు వెళ్లార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ చిన్న పార్టీల‌తో సంప్ర‌దింపులు ప్రారంభించింది. ఈ బాధ్య‌త‌ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం, డీకే శివ‌కుమార్‌కు అప్ప‌గించింది. ఇప్ప‌టికే స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల‌తో వీరు మాట్లాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/