టీఆర్ఎస్ కార్యాల‌యాల వ‌ద్ద‌ టీఆర్ఎస్ కార్యకర్తల వేడుకలు

TRS party
TRS party

హైదరాబాద్ : నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. హైద్రాబాదులోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద‌ నిరుద్యోగ బంధు కెసిఆర్ అంటూ పెద్ద ప్లెక్సీలు పెట్టారు. ఇతర జిల్లాలలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. కాగా, రేపు నిరుద్యోగుల కోసం ప్రకటన చేస్తానని నిన్న వనపర్తిలోనే కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/wp-admin/post-new.php