ఇప్పటికైనా ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇవ్వండి

ఏపీ సచివాలయం ఉద్యోగుల జేఏసీ డిమాండ్

Give 'work from home' chance :employees jac
Give ‘work from home’ chance :employees jac

Amaravati: ఏపీ సచివాలయంలో పలువురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందిన విషయం విదితమే దీంతో అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్క్ ఫ్రం హోం సదుపాయం ఇవ్వాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సచివాలయంలో 8 మంది ఉద్యోగులు కరోనా తో మృతి చెందారని తెలిపారు. . కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయం కల్పించాలని తెలిపారు. ఉద్యోగిని ఒక వ్యక్తిగా చూడొద్దని, ఒక కుటుంబంగా చూడాలని, . రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భరోసా కలిగించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/