తెలంగాణ లో గుండెపోటుతో మైనర్ బాలిక మృతి

తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటు మరణాలు ఆగడం లేదు. వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లకు పైబడిన వారికీ ఎక్కువగా గుండెపోటులు వచ్చేవి..కానీ కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుసపెట్టి యువకులు గుండెపోటుతో మరణిస్తున్నారు.

అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు..ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాగే జరిగింది. మండల పరిధిలో కస్నతండ గ్రామంలో గుండెపోటుతో బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆవిరేని పద్మ కుమార్తె అవిరేని పింకీ (16)కి ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో మృతి చెందింది. దీనికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.