రేపు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్

KTR will go to Delhi tomorrow

హైదరాబాద్‌ః బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. కేటీఆర్ సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఆమెను విచారించనుంది. అయితే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన న్యాయవాదని కలుసుకునే వెసులుబాటును కవితకు కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో, తన చెల్లెలిని కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆమెకు ధైర్యం చెప్పనున్నారు. న్యాయవాదులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. కవిత భర్త ఢిల్లీలోనే ఉన్నారు.