రజనీకాంత్ చెల్లెలుగా జీవిత రాజశేఖర్

జీవిత రాజశేఖర్ మళ్లీ తెరపై కనిపించబోతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ చవిచూసిన జీవిత..రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఆయన సినిమాలకు నిర్మాత గా , డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె పిల్లలు పెద్దవారు కావడం, హీరోయిన్స్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టడం తో వారి వెనుకాల ఉంటూ ప్రోత్సహిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లో ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.

రజనీ హీరోగా ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాలో రజనీ చెల్లెలి పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో జీవితను ఎంపిక చేశారట. చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో మార్చి 7వ తేదీ నుంచి జీవిత జాయిన్ కానున్నారు. లైకా – రెడ్ జెయింట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతుండటం విశేషం.