కీర్తి సురేష్ హాట్ పోజ్..చూసి తట్టుకోవడం కష్టమే

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ రోజు రోజుకు తనలోని హాట్ యాంగిల్ ను మరింతగా బయటకు తీస్తుంది. నేను శైలజ మూవీ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే చక్కటి విజయం అందుకొని యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి తో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వడమే కాదు ఎన్నో అవార్డ్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. రీసెంట్ గా మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట చిత్రంతో అసలైన హిట్ అందుకుంది. ఈ సినిమాలో గ్లామర్ చూపించి అందరికి షాక్ ఇచ్చింది.

మొదటి నుండి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడంతో ఈమె వెనుక వచ్చిన హీరోయిన్లంతా వరుస ఛాన్సులతో టాప్ పొజిషన్ కు వెళ్తే..కీర్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక ఇలాగైతే కుదరదని అనుకుందో ఏమోకానీ ఫస్ట్ టైం సర్కార్ వారి పాట లో అందాల ఆరబోత చేసి అబ్బో అనిపించింది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను అమ్మడు రెచ్చిపోతుంది. హాట్ హాట్ పిక్స్ తో పాటు వీడియోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా క్లివేజ్ షో తో హాట్ పోజ్ ఇచ్చి సెగలు పుట్టించింది. ఈ ఫోటోలను చూస్తుంటే ముందు ముందు ఈ భామ నుండి మరింత హాట్ పిక్స్ రావడం ఖాయమని నతిజ్ఞలు మాట్లాడుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాని సరసన దసరా మూవీ లో ఢీ గ్లామర్ పాత్రలో నటించింది. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాతో పాటు కీర్తి భోళా శంకర్ మూవీ లో నటిస్తుంది.