నూత‌న పార్టీ పేరును ప్ర‌కటించిన గులాం నబీ ఆజాద్

‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ని ప్రారంభించిన గులాం నబీ ఆజాద్

Ghulam Nabi Azad launches his party in Jammu, names it ‘Democratic Azad Party’

శ్రీనగర్‌ : గులాం నబీ ఆజాద్ జమ్మూలో తన రాజకీయ పార్టీని ప్రారంభించారు, “డెమొక్ర‌టిక్ ఆజాద్” పార్టీ పేరుతో ఈరోజు నూత‌న పార్టీ పేరును ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ప‌లువురు నేత‌లు, పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన మీద‌ట నెల‌రోజుల త‌ర్వాత ఆజాద్‌ కొత్త పార్టీతో ప్ర‌జ‌ల ముందుకొచ్చారు. త‌మ పార్టీ స్వ‌తంత్ర ఆలోచ‌న‌లు, సిద్ధాంతాల‌తో ప్ర‌జాస్వామిక పునాదుల‌పై వేళ్లూనుకుంటుంద‌ని చెప్పారు. త‌మ పార్టీ పేరు కోసం 1500 పేర్లను ప‌లువురు సూచించార‌ని, ప్ర‌జాస్వామిక‌, శాంతియుత‌, స్వ‌తంత్ర‌త‌ల‌ను ప్ర‌తిబింబించే పేరు పెట్టాల‌ని తాము క‌స‌ర‌త్తు సాగించామ‌ని విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ఆజాద్ వెల్ల‌డించారు.

పార్టీ పేరును వెల్ల‌డించే ముందు ఆదివారం ఆయ‌న పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపారు. త‌మ పార్టీ మ‌తం, కులం ఆధారంగా రాజ‌కీయాలు చేయ‌ద‌ని చెప్పుకొచ్చారు. గాంధీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌కు పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా సాధ‌నపై దృష్టిసారించేందుకు సొంత రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తామ‌ని గతంలో జ‌మ్ములో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆజాద్ పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/