తెలంగాణలో కొత్తగా 2,239 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,866

తెలంగాణలో కొత్తగా 2,239 పాజిటివ్‌ కేసులు
telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,334 మంది చికిత్స పొందుతుండగా 1,091 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 58,925 మంది కోవిడ్‌19 నిర్ధారణ పరీక్ష చేయగా ఇప్పటివరకు 28 లక్షల మందికి టెస్టులు చేసినట్లు వివరించింది.

తెలంగాణలో కొత్తగా 2,239 పాజిటివ్‌ కేసులు


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/