సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటి

పది రూపాయల డ్రింక్ తాగుతూ కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ

GHMC Mayor Gadwal Vijayalakshmi meet CM Revanth Reddy

హైదరాబాద్‌ః జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సిఎం రేవంత్ రెడ్డిని ఈరోజు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021న జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా… తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు. అమెరికన్ సిటిజన్‌షిప్ కలిగిన విజయలక్ష్మి… అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు.

రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ఎక్స్ హ్యాండిల్ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. హెలికాప్టర్‌లో కూర్చున్న రేవంత్ రెడ్డి పది రూపాయల రియల్ ఫ్రూట్ తాగుతూ ఉన్నారు. ఈ ఫొటోను క్లిక్ మనిపించి షేర్ చేశారు. “పదవి అనేది హోదా కాదు.. బాధ్యత అని రేవంత్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.