జీహెచ్ ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల నీటి సరఫరాకు అంతరాయం
బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని చోట్ల ఈనెల 23వ తేదీన నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సిటీలో మంచినీటిని సరఫరా చేస్తున్నకృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ -3కి సంబంధించి పంపింగ్ మెయిన్ హెడర్ పైప్‌కు వాటర్ లీకేజీలపై మరమ్మతు పనులను జలమండలి చేపట్టనుంది. కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ పంప్ హౌజ్ వద్ద మరమ్మతు లు చేయనున్నారు. పైపులైనుకు జంక్షన్ పనుల కారణంగా బుధవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/