రేపు అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు

ఇవాళ రాత్రికి నెల్లూరుకు చేరుకోనున్న ‘మేకపాటి’ కుమారుడు

Mekapati Goutham Reddy-File
Mekapati Goutham Reddy-File

Nellore: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం ఇవాళ మధ్యాహ్నం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి ఛాపర్ ద్వారా చేరుకోనుంది. 11.25 గంటలకు డైకాస్ రోడ్డులోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థివదేహాన్ని తరలించనున్నారు. 11.30 గంటల నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఉంచనున్నారు. ఇదిలా ఉండగా , ఇప్పటికే యూ.ఎస్ నుంచి మంత్రి మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి బయలు దేరారు. మంగళ వారం రాత్రి 11 గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి మేకపాటి భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 11గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి లోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు జరుగుతాయి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/