‘రంగమార్తాండ’ నుంచి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్

కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న మూవీ రంగమార్తాండ. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే … పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే సాంగ్ ను సోమవారం రిలీజ్ చేసారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.

రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. నేను అనే అహంభావాన్ని … నాది అనే స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, జీవితం చాలా అందంగా కనిపిస్తుంది” అనే అర్థంలో ఈ పాట సాగుతోంది. ఈ సినిమాలో రాహుల్ సిప్లి గంజ్ – శివాత్మిక జంటగా నటించడం విశేషం. ఈ చిత్ర కథ ఒక నాటకరంగానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమవుతోంది. కాలెపు మధు – వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

YouTube video