సోషల్ మీడియా షేక్ : ట్రెండింగ్ లో #YSRCPAgain2024

#YSRCPAgain2024 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం సాధించి నాలుగు సంవ‌త్స‌రాలైన సంద‌ర్భంగా వైయ‌స్సార్సీపీ సోష‌ల్ మీడియా కార్య‌కర్త‌లు, నాయ‌కులు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌తో ట్విట‌ర్లో ట్రెండింగ్‌ను ప్రారంభించారు. ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్ జాతీయస్థాయిలో NO.1 స్థానంలో నిలిచింది.

నాలుగేళ్లలో వైస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు సంక్షేమ కార్యక్రమాలు పథకాలు రాజకీయంగా సాధించిన విజయాలు మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని వైస్సార్సీపీ కార్యకర్తలు , శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రజలు, నెటిజన్లు ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా ఈ హ్యాష్ ట్యాగ్ ను దేశంలోనే నంబర్ 1గా పోస్ట్ చేస్తున్నారు. సీఎంగా జగన్ సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న ఆదరణ తదితర అంశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వైస్సార్సీపీ సోషల్ సైన్యం పోస్ట్ చేస్తున్నారు.

గత కొద్దీ నెలలుగా వైస్సార్సీపీ పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పధకాల గురించి ప్రజల నుండి సమాచారం సేకరిస్తూ వస్తున్నారు. మరోపక్క సీఎం జగన్ సైతం వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఇదే సమయంలో రానున్న ఎన్నికలపైన సీఎం జగన్ ఫోకస్ చేసారు. ఎన్నికల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన కేడర్ ను సంసిద్దులను చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల సమయంలోనూ వైస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేసింది. ఇప్పుడు తిరిగి పని మొదలు పెట్టింది. #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌తో ట్విట‌ర్లో ట్రెండింగ్‌ చేస్తోంది. ఈ హ్యాష్ ట్యాగ్ కేవలం పది నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి రావడం.. జాతీయ స్తాయిలో మొదటి స్థానంలో నిలవడంతో వైస్సార్సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.