మైలార్ దేవ్ పల్లి బృందావన్ కాలనీలో రెచ్చిపోయిన గాంజా గ్యాంగ్

గంజాయి గ్యాంగ్ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి పూట దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా శుక్రవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి బృందావన్ కాలనీలో నలుగురు వ్యక్తులపై సుమారు 50 మంది దాడి చేసారు.

ఈ దాడిలో రావుల భాస్కర్, రావుల విక్రాంత్, రాజు, విశాల్ లు గాయపడ్డారు. చిన్నపిల్లల గొడవను ఆపడానికి వెళ్ళిన రావుల భాస్కర్ ను కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యింది గాంజా గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మైనర్ రావుల విక్రాంత్ మెడపై కత్తితో దాడి చేశారు. యువకుడు ప్రతిఘటించి తప్పించుకున్నాడు. కాలనీ వాసులు గాంజా గ్యాంగ్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.