అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ

తెలంగాణ బిజెపి నేతలు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్..నిన్న ప్రధాని తో భేటీ కాగా..ఈరోజు బుధువారం కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ లో బీజేపీ పార్టీ పని తీరు ఎలా ఉంది..చేరికలు ఎలా ఉన్నాయనేదానిపై అమిత్ షా కు వివరించేందుకు భేటీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బిజెపి అగ్ర నేతలు సైతం పూర్తి ఫోకస్ తెలంగాణ ఫై పెట్టారు. రీసెంట్ గా కేసీఆర్ బిఆర్ఎస్ అంటూ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో..తెలంగాణ పట్టు పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో బిజెపి ఉంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ , బిఆర్ఎస్ నుండి నేతలను బీజేపీ లోకి రప్పించుకున్న నేతలు..కాంగ్రెస్ నేతల ఫై మరింత ఫోకస్ పెట్టారు. పార్టీ ఫై అసంతృప్తి ఉన్నవారిని లాక్కుకునేందుకు ట్రై చేస్తున్నారు.

ఇక మంగళవారం పార్లమెంట్‌‌‌‌లోని పీఎం ఆఫీసులో మోడీతో అర్వింద్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు అర్వింద్‌‌‌‌తో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. తర్వాత తన నివాసంలో మీడియాతో అర్వింద్ చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని పొలిటికల్, పాలన వ్యవస్థ తీరును ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.