బాపూ ఘాట్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుక‌లు

హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుక‌లు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం.. ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. లంగ‌ర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో జరిగిన వేడుక‌ల్లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని పాల్గొని మ‌హాత్ముడికి పుష్పాంజ‌లి ఘ‌టించి ఘ‌న నివాళుల‌ర్పించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/