ప్రేమ కోసం రూ.10 కోట్లు వదులుకున్న జపాన్‌ రాకుమారి

టోక్యో: జపాన్‌ రాకుమారి మాకో తన ప్రియుడు, క్లాస్‌మేట్‌ కొమురోను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సామాన్యుడైన కొమురోను పెండ్లి చేసుకొంటే మాకో తన రాజకుమార్తె హోదాను కోల్పోతారు. వివాహం సందర్భంగా ఆనవాయితీగా లభించే రూ.10 కోట్లు కూడా రావు. కొమురో కోసం వీటన్నింటినీ వదులుకోవడానికి మాకో సిద్ధపడ్డారు. ఈ నెల 26న వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. పెండ్లి కూడా రాజరికపు సంప్రదాయాలతో కాకుండా సాదాసీదాగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/