నిరసనలు ఎలా చేయాలో చెప్పిన గల్లా జయదేవ్‌

Jayadev Galla
Jayadev Galla

అమరావతి: టిడిపి అధినేత విశాఖ పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబును అడ్డుకునేందుకు కోడిగుడ్లు, టమాటాలతో వచ్చారంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. దీనిపై టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎక్కడైనా సక్రమంగా చేపట్టే నిరసనలు ఉంటాయి, వైఎస్‌ఆర్‌సిపి తరహా నిరసనలు కూడా ఉంటాయి. సరైన పద్ధతిలో నిరసన తెలియజేయడం అంటే అమరావతి రైతుల మాదిరి శాంతియుతంగా నిరసన చేయాల్సి ఉంటుంది. వైఎస్‌ఆర్‌సిపి తరహా నిరసన విధానం అంటే చెప్పులు విసరడం, టమాటాలు, కోడిగుడ్లు విసురుతూ హింసను ప్రేరేపించడం అంటూ ట్వీట్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/