కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టిన కేంద్ర మంత్రి

కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం

ravi shankar prasad
ravi shankar prasad

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు సోనియాగాంధీని ఆహ్వానించలేదన్న కారణంతో కాంగ్రెస్‌ నేతలు హాజరుకాకపోవడాన్ని బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంఖర్‌ ప్రసాద్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షులు జార్జి బుష్‌, బరాక్‌ ఒబామా భారత పర్యటనల సందర్భంలో ఇచ్చిన విందుకు బిజెపి అధ్యక్షులను ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. అయినా ఆనాడు బిజెపి నేతలు ఆ విందుకు దూరం కాలేదని రవిశంఖర్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/