మణిపూర్‌లో 3.3 తీవ్రత స్వల్ప భూకంపం

earthquake

ఇంఫాల్‌: మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 70 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.

భూకంప కేంద్రం ఉక్రుల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని చెప్పింది. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించండంతో జనాలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.