మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇజ్రాయెల్‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాలను ఎగుమతి చేసిన భారత్‌

netanyahu, modi
netanyahu, modi

దిల్లీ: హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని భారత్‌ ఎత్తివేసి, ఈ ఔషధాన్ని విదేశాలకు దిగుమతి చేస్తుంది. దీనితో ప్రపందేశాలు భారత్‌పై ప్రశంశలు కురిపిస్తున్నాయి. నిన్న అమెరికా. బ్రెజిల్‌ తో పాటు కొన్ని దేశాలు ప్రధాని మోదికి ధన్యవాధాలు తెలుపగా నేడు ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ చేరింది. నిన్న ఈ ఔషధాలను ఇజ్రాయెల్‌ కు పంపడంతో, ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. మోదికి కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు భారత ప్రధాని, నా ఆప్త మిత్రుడు మోదీ కి ధన్యవాదాలు. ఇజ్రాయెల్‌ పౌరులంతా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కరోనా మహామ్మారి విజృంభణ మొదలయినప్పటినుండి నేను మోదీతో తరచూ చర్చిస్తున్నాను. పరిస్థితులపై ఎప్పటికపుడు చర్చలు జరుపుతున్నాం. అని నెతన్యాహు ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/