ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు .. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లాలంటే..

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ అప్లికేషన్

Police who are considering permit passes

Amaravati: ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్… ఇదే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం https://www.spandana.ap.gov.in/ అనే వెబ్ సైట్‌ను నిర్వహిస్తుంది. ఆ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలి.
ఆ వెబ్ సైట్‌లోకి వెళ్లిన తర్వాత Covid-19 Movement of People అని కొత్త ఆప్షన్ ఉటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది.
అప్పుడు http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration అని కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ వివరాలు నమోదు చేయాలి.

  • ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారా?,
  • ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారో తెలియజేయాలి.
  • *మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్, వయసు తెలియజేయాలి.
  • ఆ తర్వాత ఏపీలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నమోదు చేయాలి.మీ జిల్లా, మండలం, ఊరు, అది రెడ్ జోన్‌లో ఉందా? అనే వివరాలు అందించాలి.
  • ఆ తర్వాత మీరు ఎందుకు ప్రయాణించాలనుకుంటున్నారో తెలపాలి.
  • మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే వివరాలు కూడా అందించాలి.
  • మీరు ఒక్కరే కాకుండా, ఓ పది, 15 మంది వరకు ఉన్నట్టయితే, ఆ వివరాలు తెలియజేయాలి.
  • మీరు వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వారిని ఏ రకంగా రాష్ట్రానికి తీసుకుని రావాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.
  • ఇతర రాష్ట్రాల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు కూడా తెలుస్తాయి.
  • మీరు రాష్ట్రంలో ప్రభుత్వంతో ఏపీ సర్కారు మాట్లాడి మీరు ఉన్న దగ్గరికే బస్సులు పంపిస్తారు.
  • మిమ్మల్ని రైల్వే స్టేషన్‌ వరకు తీసుకొచ్చి అక్కడ నేరుగా ట్రైన్ ఎక్కిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/