ఏపిలో వలసకూలీల ఆందోళనలు

తమ సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ డిమాండ్‌

migrant workers
migrant workers

పశ్చిమగోదావరి: ఏపిలో లాక్‌డౌన్‌ సడలింపు నిబంధనలు నేటినుంచి అమలులోకి రావడంతో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూలీలు రోడ్లమీదకు వచ్చారు. ఆయా ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో సుమారు 300 మంది వలస కూలీలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చి వారిని తమ రాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళనలు చేశారు. వారికి సర్ధిచెప్పడానికి వచ్చిన పోలీసులపైకి రాళ్లు, సీసాలతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠిఛార్జి చేసి వారి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆయా రాష్ట్రాలనుంచి అనుమతులు వస్తే తప్పకుండా పంపిస్తామని, అంతవరకు ఎక్కడికి పంపబోమని పోలీసులు వారికి చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో పలు ప్రాంతాలలో వలసకూలీలు రోడ్లపైకి వచ్చి ఇదే తరహ ఆందోళనలు చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/