రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ

మంగళవారం నామినేషన్‌ను దాఖలు

Former PM HD Deve Gowda to contest Rajya Sabha polls

బెంగాళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధికారికంగా ప్రకటించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమను అభ్యర్థించారని, అందుకే బరిలోకి దిగనున్నారని జేడీఎస్ ప్రకటించింది. మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేస్తామని జేడీఎస్ నేతలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, రాజస్థాన్‌ మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మేఘాలయలో ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ దేశంలో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే తాజాగా లాక్‌డౌన్‌ను సడలించడంతో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ కొత్త తేదీలను ప్రకటించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/