కువైట్‌లో 24 గంటల్లో 701 కొత్త కేసులు

కువైట్‌లో 24 గంటల్లో 701 కొత్త కేసులు
Coronavirus-Kuwait

కువైట్‌: కువైట్‌లో‌ కరోనా వైరస్‌ ప్ర‌భావం క్రమంగా తుగ్గుతుంది. తాజాగా రిక‌వ‌రీలు 66వేల మార్కును దాటాయి. గ‌డిచిన 24 గంటల్లో 701 కొత్త కేసులు న‌మోదైతే… 648 రిక‌వ‌రీలు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ‌ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 74,486కు చేరగా… మొత్తం రిక‌వ‌రీలు 66,099 అయ్యాయి. ఇప్ప‌టికే 489 మంది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 7,898 మంది క‌రోనా రోగులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విశ్వ‌వ్యాప్తంగా విల‌యం సృష్టిస్తున్న క‌రోనా ఇప్ప‌టికే 7.57 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. అలాగే రెండు కోట్ల 10 ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది. ‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/