సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..4 ఎమ్మెల్యేలకు విప్ పదవులు

తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వారిని తొలగిస్తూ వారి స్థానంలో వేరే వారిని గతంలో పనిచేసిన వారిని తీసుకుంటున్నారు. ఇప్పటీకే అనేక మందిపై వేటు వేసిన సీఎం..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం విప్‌ల హోదా కల్పించారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనలతో.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ కు విప్‌ పదవులు దక్కాయి. ఈ నలుగురిని విప్ లు గా ప్రకటించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోకాలంగా ఉన్నారు. పలు ఎన్నికల్లో ఓటమి పాలైయ్యాయి. అయినా సరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ధర్మిపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ ను ఓడించారు లక్ష్మణ్ కుమార్. ఈ క్రమంలోనే ఇప్పుడు విప్ పదవి దక్కింది.