బీఎన్‌ రెడ్డి నగర్‌లో దారుణం..స్కూల్ బస్సు ఢీ కొని చిన్నారి మృతి

హైదరాబాద్ లో మరో స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. చర్లపల్లి లోని బీఎన్‌ రెడ్డి నగర్‌లో స్కూల్‌ బస్‌ ఢీకొని నాలుగేళ్ల బాలుడు ప్రణయ్ మృతి చెందాడు. బాలుడు అమ్మమ్మతో కలిసి వస్తుండగా ఓ స్కూల్ బస్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్‌ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.